“అందాల రాక్షసి” చిత్రం ఆడియో విడుదల అయిన రోజు నుండి పరిశ్రమలో చాలామంది ఈ చిత్రం గురించి తెలుసుకుంటూ వస్తున్నారు. అందరూ నూతన నటీనటులే నటించిన ఈ చిత్రం పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. ఈ చిత్ర నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవీన్,రాహుల్ మరియు లావణ్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంతో హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో నటీనటులకు కూడా ఇది తొలి చిత్రమే. వారాహి చలన చిత్రం బ్యానర్ మీద ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రంలో కొంత భాగాన్ని ఎస్ ఎస్ రాజమౌళి కొనుగోలు చేసి చిత్రానికి సహా నిర్మాత అయ్యారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న దిల్ రాజు విడుదల చెయ్యనున్నారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.