ఇతర హీరోలతో కలిసి పని చెయ్యడానికి నేను సిద్దమే : బాలకృష్ణ


నందమూరి బాలకృష్ణ యువ హీరోలు మంచి కథతో “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రంలో లాంటి పాత్రలతో వస్తే చేస్తాను అని చెప్పారు. ఫిలిం చాంబర్ లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్నీ స్వయాన బాలకృష్ణ చెప్పారు. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ ఇలా సమాధానం ఇచ్చారు. “కథ బాగుంటే ఎందుకు చెయ్యను? దర్శకులు మంచి కథతో , “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రంలోలా మంచి పాత్రతో వస్తే ఖచ్చితంగా చేస్తాను” అని అన్నారు. బాలకృష్ణ, లక్ష్మి మంచు, మనోజ్ మరియు దీక్ష సెత్ ఈ విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారని అందరు ఆనందం వ్యక్తపరిచారు. ఎక్కడయినా పైరసీ జరుగుతున్నట్టు తెలిస్తే వారికి తెలియజేయాలని కోరారు.

Exit mobile version