బొంబాయి, భారతీయుడు మరియు క్రిమినల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ మనీషా కొయిరాల. తాజా సమాచారం ప్రకారం మనీషా తన నేపాలీ భర్త సామ్రాట్ దల నుంచి విడిపోయారు. వీరిద్దరికీ పెళ్లై రెండు సంవత్సారాలైంది. వీరిద్దరి పెళ్లి ఖాట్మండులో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి తన వివాహ బందంలో ఏదో సమస్యలున్నాయని వార్తలు వచ్చాయి. ఈ విషయం మీద అప్పట్లో మనీషా కోయిరాలా సోషల్ వర్కింగ్ సైట్స్ మీద కోప్పడ్డారు. మనీషా కోయిరాలా ప్రస్తుతం ముంబాయిలో ఉన్నారు మరియు మనీషా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.