శ్రీనువైట్లకి వాచ్ బహుకరించిన ఎన్టీఆర్


ఎన్టీఆర్ తన దర్శకుడు శ్రీను వైట్ల కి ఖరీదయిన బ్రేట్లింగ్ వాచ్ ని బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం వీరు ఇద్దరు “బాద్షా” చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు. ఈ సంఘటన గురించి చెప్తూ గోపీమోహన్ వాచ్ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. “బాద్షా ఎన్టీఆర్ టాకీ భాగం పూర్తయ్యాక దర్శకుడు శ్రీను వైట్లకి బ్రేట్లింగ్ వాచ్ బహుమతిగా ఇచ్చారు దీనికి బదులుగా శ్రీను వైట్ల ఎన్టీఆర్ కి భారీ విజయాన్ని అందించాలని అనుకుంటున్నారు” అని ట్విట్టర్లో చెప్పారు. ఈ మధ్యనే ఈ చిత్రం ఇటలీలో మిలన్ లో చిత్రీకరణ జరుపుకుంది ప్రస్తుతం ఈ చిత్ర బృందం స్విట్జర్లాండ్ కి పయనమయ్యింది అక్కడ పొడవయిన షెడ్యూల్ లో మిగిలిన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 11,2013న విడుదల కానుంది.

Exit mobile version