త్రిషా దాని కోసం 25 లక్షలు ఖర్చు పెట్టిందట.!


దాదాపు తెలుగులో ఉన్న అగ్ర హీరోలు, కుర్ర హీరోలందరితో రొమాన్స్ చేసిన హీరొయిన్ త్రిషా. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర కథానాయికగా వెలిగిన త్రిషా ఇటీవల ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కుందట. అందులో విశేషమేముంది అంటారా! ఉంది, ఆ ఫ్లాట్లో కింది నుండి మొదటి అంతస్తులోకి వెళ్ళడానికి ఆమె ఎంత ఖర్చు చేసిందో తెలుసా? అక్షరాల 25 లక్షలు అవును ఫ్లాట్లో కింది నుండు మొదటి అంతస్తు వరకు వెళ్ళడానికి 25 లక్షలు ఖర్చయింది. వినడానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా ఇది నిజం. ప్రత్యేకమైన మార్బుల్స్ వాడటం వలన అవి తెప్పించడానికి అంత ఖర్చయిందట. ఇల్లనేది మానసిక ప్రశాంతత కోసం దాని కోసం ఎంత ఖర్చు పెట్టిన తప్పు లేదు అంటోంది. త్రిషా చివరగా తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించిన దమ్ము యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో మరే సినిమా అంగీకరించలేదు. తమిళంలో మాత్రం 3 సినిమాలు చేస్తుంది.

Exit mobile version