మరో నాలుగు సంవత్సరాలు ఖాళీ లేదు : రాజమౌళి


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘ఈగ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్ర విజువల్ ఎఫ్ఫెక్ట్స్ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాజమౌళి మాట్లాడుతూ ” ‘మగధీర’ చిత్రానికి విడి విడిగా విజువల్ ఎఫ్ఫెక్ట్స్ చేసిన వాళ్ళందరూ కలిసి మకుట అనే ఒక సంస్థని నెలకొల్పి ‘ఈగ’ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ చేసి వారి సంస్థకు మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే నన్ను బాలీవుడ్లో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. నాకు ఇంకో నాలు సంవత్సరాల వరకు ఖాళీ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను కమిట్ అయిన చిత్రాలు తీయడానికి నాకు నాలుగు సంవత్సారాల టైం పడుతుంది కాబట్టి ఆ తర్వాతే బాలీవుడ్ గురించి ఆలోచిస్తాను అని” ఆయన అన్నారు. నాని, సుదీప్ మరియు సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version