జనంలో చర్చగా మారిన సుడిగాడు


అల్లరి నరేష్ రానున్న చిత్రం “సుడిగాడు” అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అవ్వగానే జనం ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ చిత్రంలో వాడిన స్పూఫ్ ల గురించి ఇప్పటికే చర్చించుకుంటున్నారు భారీ విజయాలు సాదించిన చిత్రాల అన్నింటి మీద వాటిలో డైలాగ్లను ఉపయోగించి స్పూఫ్ చెయ్యటం ప్రజలలో మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది ట్రైలర్లో ఉన్నదే కాకుండా ఇంకా చిత్రంలో ఎటువంటి సన్నివేశాలు ఉండబోతున్నాయని జనం ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. “తమిళ్ పడం” అన్న చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్ట్ మూడవ వారంలో విడుదల కానుంది.

Exit mobile version