జూలై 28న మొదలుకానున్న సుశాంత్ చిత్రం


ఎట్టకేలకు సుశాంత్ హీరోగా నటించబోయే మరో చిత్ర చిత్రీకరణ మొదలుకానుంది.”అడ్డా” అనే ఈ చిత్రానికి సాయి రెడ్డి  దర్శకత్వం వహించనున్నారు . నాగ సుశీల మరియు చింతలపూడి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రం లాంచనంగా జూలై 28న అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభించనున్నారు. ఈ చిత్ర బృందం మరియు సాంకేతిక విభాగం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. సుశాంత్ చిత్రం చేసి దాదాపుగా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈసారి ఈ చిత్రంతో విజయం సాదించాలని సుశాంత్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకోసం సుశాంత్ బాగా కష్టపడి తన దేహ ధారుడ్యాన్ని పెంచుకుంటున్నారని సమాచారం.

Exit mobile version