నవదీప్ మరియు స్వాతి కలిసి “బంగారు కోడిపెట్ట” అనే చిత్రంలో కనిపించనున్నారు. రాజ్ పిప్పళ్ళ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో రాజ్ పిప్పళ్ళ సుమంత్ మరియు కృతి కర్భంద ప్రధాన పాత్రలలో “బోణి” చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. సునీత తాటి ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కానుంది. గురు ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రం త్వరలో చిత్రీకరణ మొదలుపెట్టుకోనుంది. ఇది కాకుండా నవదీప్ “పొగ” మరియు “మైత్రి” చిత్రాలలో నటిస్తున్నారు. స్వాతి “స్వామి రా రా” చిత్రంలో నిఖిల్ సరసన కనిపించనున్నారు.