బాలీవుడ్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ కామెడీ హీరో గోవిందా ప్రస్తుతం హిట్లు లేక అల్లాడిపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు వారుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడతుండటంతో ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావట్లేదు. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన ‘పార్టనర్’ సినిమా తరువాత గోవిందాకి సరైన హిట్ లేదు. గోవిందా హీరోగా ఆయనే నిర్మాతగా మారి ‘దురంధర్’ అనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే గోవిందా సరసన నటించడానికి కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా కావాలని ఆమెని సంప్రదించారు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ సరసన నాలుగు సినిమాలు, తమిళ్లో సూర్య, విజయ్ సరసన రెండు సినిమాలు, హిందీలో అక్షయ్ కుమార్ సరసన ‘స్పెషల్ చబ్బిస్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న కాజల్ ఎటూ తెల్చుకోలేకపోతుంది. కాజల్, గోవిందా సరసన నటిస్తుందో లేదో వేచి చూడాలి.