మళ్ళీ వాయిదా పడ్డ ‘దేవుడు చేసిన మనుషులు’

మాస్ మహారాజ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం విడుదల ఆగష్టు 15కి వాయిదా పడిందని సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3న విడుదల చేయాలనుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఆగుస్ట్ 15న విడుదల కానుందని ఉన్న పోస్టర్లు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మరియు సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషించారు. పూర్తి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా భాగాన్ని బ్యాంకాక్ లో చిత్రీకరించారు. బి.వి ఎస్.ఎన్ ప్రసాద్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతాన్ని అందించారు.

Exit mobile version