రేపు అభిమానులతో సందడి చేయనున్న పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ తన ఫాన్స్ తో కలిసి నటించనున్నారని ఇది వరకే తెలిపాము. ఈ సన్నివేశాల షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ విషయం గురించి ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక విడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ” రేపు ఉదయం 9 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ దగ్గర పవన్ అభిమానులతో తీయాల్సిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీకి రెండు ఎంట్రన్స్ లు ఉన్నాయి అందులో విజయవాడ హైవేలో ఉన్న ఎంట్రన్స్ వద్ద షూటింగ్ చేస్తున్నాం. ఈ షూటింగ్ కి హైదరాబాద్లో ఉన్న పవన్ అభిమానులు మాత్రమే రావాలని, రిస్క్ చేసి బయట ఊళ్ళలో ఉన్న పవన్ ఫాన్స్ ఇబ్బందిపడి రావాల్సిన అవసరం లేదు” అని ఆయన ఈ వీడియో ద్వారా తెలిపారు.

మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యూనివర్సల్ మీడియా పై డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : క్లిక్ హియర్

Exit mobile version