“ముగమూడి” తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఆర్ బి చౌదరి


జీవ త్వరలో “ముగమూడి” చిత్రంలో సూపర్ హీరోగా కనిపించి అందరిని ఆశ్చర్యపరచబోతున్నారు. మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుడగా యుటివి మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తెలుగు హక్కులను ఆర్ బి చౌదరి సొంతం చేసుకున్నారు . ఈ చిత్రాన్ని అయన మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద విడుదల చెయ్యనున్నారు. యుటివి దక్షణాది అధినేత ధనంజయ్ గోవింద్ మాట్లాడుతూ “ముగమూడి” చిత్ర తెలుగు వెర్షన్ హక్కులను ఆర్ బి చౌదరి గారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆగస్ట్ 31న విడుదల చెయ్యనున్నారు ఈ చిత్ర పేరుని ఆగస్ట్ మొదటి వారంలో ఆడియోతో పాటు ప్రకటిస్తారు” అని అన్నారు. ఈ మధ్య వచ్చిన జీవ చిత్రాలు “రౌద్రం” మరియు “వచ్చాడు గెలిచాడు” చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చవిచూసాయి. “ముగమూడి” చిత్రంతో విజయం సాదించాలి అనుకుంటున్నారు. పూజ హెగ్డే, నరైన్ మరియు నాజర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు పేరుని త్వరలో ప్రకటిస్తారు. కృష్ణ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version