జర్నలిస్టుగా నయనతార


సౌత్ ఇండియన్ చలన చిత్ర రంగంలో అన్ని భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నయనతార. తను చేస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన పాత్రని ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లో చేస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు దేవిక మరియు నేనొక జర్నలిస్టుగా కనిపిస్తాను. ఈ చిత్రంలో రానాకి సరి సమానమైన పాత్ర నాది. క్రిష్ గారు ఒక విభిన్న కథాంశాన్ని తీసుకొని సరికొత్తగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నా పాత్రని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పాత్ర కోసం నేను ఇప్పటివరకు చేయని కొన్ని రేర్ ఫీట్స్ కూడా ఈ చిత్రంలో చేశాను. ‘శ్రీ రామ రాజ్యం’ చిత్రం తర్వాత దేవిక లాంటి ఇలాంటి పాత్ర దొరకడం చాలా ఆనందంగా ఉందని” ఆమె అన్నారు.

నయనతార ప్రస్తుతం తెలుగులో రానా సినిమా కాకుండా నాగార్జున సరసన ‘లవ్ స్టొరీ’ మరియు గోపి చంద్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో కూడా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నయనతారకి ఈ సినిమాలు తన పూర్వ వైభవాన్ని తీసుకోస్తాయో ? లేదో? తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Exit mobile version