బాలీవుడ్లో అతి తక్కువ ఖర్చుతో తెరకెక్కి బాక్స్ ఆఫీసు దగ్గర సూపర్ హిట్ గా నిలిచినా చిత్రం “విక్కీ డోనర్”. కామెడి కింగ్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ఈ చిత్ర రిమేక్ లో నటించాలని ఆసక్తిగా ఉన్నారని టాలీవుడ్లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర రిమేక్ హక్కుల్ని హీరో సిద్దార్థ్ కొనుక్కున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న పుకార్ల వల్ల ఈ సినిమాలో ఎవరు నటించనున్నారు? ఎవరు నిర్మించనున్నారు? అనేది ఖచ్చితంగా తెలియడంలేదు. ప్రజల్లో వివాదాస్పదమైన స్పర్మ్ డొనేషన్ మీద తెరకెక్కిన ‘విక్కీ డోనర్’ చిత్రాన్ని జాన్ అబ్రహం నిర్మించారు.