మలేసియాలో “షాడో” చిత్రీకరణలో పాల్గొనడానికి వెంకటేష్ సిద్దమయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గత నెల ముంబైలో చిత్రీకరణ జరుపుకోవలసి ఉండగా అక్కడ భారీ వర్షాల కారణంగా రద్దయ్యింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ లో కౌలాలంపూర్ వద్ద లంగ్కవి దీవుల్లో భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు జరగనుంది. వెంకటేష్, శ్రీకాంత్, ఆదిత్య పంచోలి మరియు రాహుల్ దేవ్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. తాప్సీ మరియు మధురిమ బెనర్జీ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.