చంద్ర శేకర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోపీచంద్ చిత్రం తరువాతి షెడ్యూల్ లడఖ్ లో జరుపుకోనుంది,. ఈ మధ్యనే ఈ చిత్ర చిత్రీకరణ హైదరాబాద్ లో జరుపుకుంది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు విడుదలయిన వర్కింగ్ స్టిల్ ప్రకారం ఈ చిత్రంలో గోపిచంద్ సెక్యూరిటీ గార్డ్ పాత్రలో కనిపించనున్నారు . ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒక సాధారణ మనిషి అద్భుతమయిన నిధిని ఎలా కనుగొన్నాడు అనే అంశం మీద ఉండబోతుంది. చిత్రంలో చాలా భాగం వరకు హైదరాబాద్, రాజస్థాన్, లడఖ్ మరియు జోర్డాన్ లలో జరుపుకుంటుంది. తాప్సీ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు శాందత్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.