స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “జులాయి” నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిర్మాణాంతర కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోస్ లో జరుగుతున్నాయి స్వయానా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ మరియు బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, సోను సూద్ మరియు ఇతరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డి వి వి దానయ్య సమర్పిస్తున్నారు.