నా ఊపిరున్నంత వరకు మా తాతగారి పార్టీ కోసమే పనిచేస్తా.!


ఈ రోజు రాష్ట్ర రాజకీయంలో వస్తున్న అనూహ్యమైన మార్పులను గూర్చి మాట్లాడటానికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఎన్.టి.ఆర్ కి సన్నిహితుడు మరియు ఆప్తుడు అయిన కొడాలి నాని వై.ఎస్ జగన్ మరియు విజయమ్మలతో జరిగిన సమావేశం అనంతరం టిడిపి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఈ మార్పుతో అందరు పొలిటికల్ విశ్లేషకులు కొడాలి నాని టిడిపిని వదిలి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. కొడాలి నాని మరియు ఎన్.టి.ఆర్ ఎంతో సన్నిహితులవడం వల్ల, ఎన్.టి.ఆర్ గారే నాని వెనకుండి ఇదంతా చేయిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎన్.టి.ఆర్ ఈ విషయాన్ని ఖండించారు, ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ” ఇప్పుడు వస్త్తున్న పుకార్లను పూర్తిగా ఖండిస్తున్నాను. కొడాలి నాని తీసుకున్న నిర్ణయానికి నాకు ఎలాంటి సంభందము లేదు. నాని నాకు సన్నిహితుడు మాత్రమే కానీ అతను టిడిపికి వ్యతిరేకంగా చేసే పనులకు మరియు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే విషయాలకు నాకు ఎలాంటి సంభందము లేదు. నేను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటాను మరియు నేను బతికున్నంత వరకు మా తాత గారైన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టిడిపి పార్టీకి సేవ చేస్తుంటానని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని” ఎంతో ఆవేశంతో అన్నారు.

Exit mobile version