నిఖిల్ మరియు స్వాతి ఒక చిత్రంలో కలిసి నటించబోతున్నారు. అన్ని సరిగ్గా జరిగితే సుధీర్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. గతంలో “హైదరాబాద్ నవాబ్స్”,”అంగ్రేజ్” , “యువత”, “ఆంజనేయులు”, “నిన్న నేడు రేపు” అసిస్టెంట్ డైరెక్టర్ గా మరియు నిఖిల్ ప్రధాన పాత్రలో వచ్చిన “వీడు తేడా” చిత్రానికి చీఫ్ అసోసియేట్ గా పని చేశారు. ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “స్వామి రారా” అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం “డెల్లి బెల్లీ” లాగా ఉండబోతుందని సమాచారం ఈ మధ్య విడుదలయిన నిఖిల్ “డిస్కో” చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది ఈ చిత్రం ఎం చేస్తుందో వేచి చూడాలి.