లక్ష్మి రాయ్ ‘తాండవం’ సినిమా కోసం ఇటీవలే లండన్ వెళ్ళింది. విక్రమ్, జగపతి బాబు, అనుష్క, ఏమీ జాక్సన్ మఖ్య పాత్రల్లో నటిస్తున్న తాండవం సినిమాలో లక్ష్మి రాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల లక్ష్మి రాయ్ నటించిన ‘కాంచన’ భారీ విజయం సాధించగా అతిధి పాత్రలో నటించిన ‘మంకత’ కూడా భారీ విజయం సాధించింది. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యుటివి మోషన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న తాండవం ఈ సంవత్సరం విడుదల కానుంది. లక్ష్మి రాయ్ తెలుగులో నటించిన ‘అధినాయకుడు’ జూన్ 1న విడుదల కానుంది