కమల్ హాసన్ రాబోతున్న చిత్రం “విశ్వరూపం” చిత్ర ఫస్ట్ లుక్ జూన్ లో సింగపూర్ లో ఐఐఎఫ్ఏలో విడుదల కానుంది. తన పనితనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కమల్ హాసన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. భారతీయ చిత్రాలకు అతి పెద్ద వేదిక ఐ ఐ ఎఫ్ ఏ కావున ఇక్కడ ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు కొన్ని సన్నివేశాలను కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రంలో కమలహాసన్ తో పాటు రాహుల్ బోస్,పూజా కుమార్ మరియు ఆండ్రియా జేర్మయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టెర్రరిజం మీద ఉండబోతునట్టు తెలుస్తుంది. ప్రసాద్ వి పోట్లురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం మరియు హిందీలలో కూడా ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. శంకర్-ఎహాసన్-లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.