మహేష్ బాబు,వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఈ ఏడాది అత్యంత వేచి చూస్తున్న చిత్రం. చాలా రోజుల తరువాత ఇద్దరు ప్రధాన తారలు ఒక చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు ఈ చిత్రం మొదలయ్యాక పరిశ్రమలో కొన్ని మల్టీ స్టారర్ లు మొదలయ్యాయి. ఈ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టుకొని మూడు నెలలు దాటింది. ఈ చిత్రం తన కెరీర్లో మంచి చిత్రంగా మిగిలిపోతుందని మహేష్ బాబు నమ్ముతున్నారు.”ఈ నెల 31న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫస్ట్ లుక్ విడుదల కాబోతుంది ఈ చిత్రం నా కెరీర్ లో మరో మంచి చిత్రంగా మిగిలిపోనుంది దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరియు నిర్మాత దిల్ రాజు కి కృతజ్ఞతలు వెంకటేష్ గారితో కలిసి పని చేయ్యటం చాలా ఆనందంగా ఉంది” అని ట్విట్టర్ లో చెప్పారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్,సమంత ,అంజలి లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది.