యాబై రోజులు పూర్తి చేసుకున్న “రచ్చ”


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రచ్చ” ఈరోజు అర్ధ శతదినోత్సవం జరుపుకోనుంది. ఈ చిత్రం విడుదలయిన తొలినాళ్ళలో మంచి బిజినెస్ చేసింది ఈ చిత్రం మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఈ చిత్రాన్ని ఈ వసూళ్లు లాభధాయకమయిన చిత్రంగా మార్చింది. “రచ్చ” చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ ఏడాది వేసవిలో మొదట హిట్ అయ్యిన చిత్రం “రచ్చ”. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఈ వేడుకను అద్బుతంగా జరపాలని అనుకుంటున్నారు కాని దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు.

Exit mobile version