మంచు మనోజ్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ అవుట్ పుట్ పై మనోజ్ చాలా సంతోషంగా ఉన్నాడు. గత 20 రోజులుగా ఈ చిత్రం కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యుల్ లో బాలకృష్ణ, మనోజ్ కుమార్, దీక్షా సేథ్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఈ రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంది. బాలకృష్ణ లాంటి అగ్ర నటుడితో పని చేయడం వాళ్ళ తనకెంతో ఎనర్జీ వస్తుందని, ఆయనకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా కంపోజ్ చేసారు. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే నెలాఖరుకు విడుదలకు సిద్ధమవుతుంది.