దుబాయ్ వెళ్తున్న ‘అల్ ది బెస్ట్’ సినిమా యూనిట్


శ్రీకాంత్ ప్రస్తుతం జే.డి చక్రవర్తి డైరెక్షన్లో ‘అల్ ది బెస్ట్’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 28 నుండి ఈ చిత్ర యూనిట్ దుబాయ్ వెళ్లనుంది. లక్కీ శర్మ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జే. సాంబశివ రావు నిర్మిస్తున్నారు. షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ చిత్రం మే నెలాఖరుకు విడుదలకు సిద్ధమవుతుంది. హేమచంద్ర సంగీతం అందించిన అల్ ది బెస్ట్ చిత్ర ఆడియో కూడా త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ మరియు కృష్ణ భగవాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version