లక్కీ శర్మ లక్కీ ఆఫర్ కొట్టేసింది. కృష్ణవంశి డైరెక్షన్లో నాని హీరోగా వస్తున్న చిత్రంలో రెండవ హీరొయిన్ గా లక్కీ శర్మ ఎంపికైనట్లు సమాచారం. కేథరిన్ తెరిస్సా అనే మలయాళ హీరొయిన్ ని కూడా తీసుకున్న కృష్ణవంశీ హీరోయిన్లను చూపించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్నాడు. ఈ సినిమాలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఎలా చూపిస్తాడో చూడాలి మారి. పబ్లిసిటీకి దూరంగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లక్కీ శర్మ ప్రస్తుతం శ్రీకాంత్ సరసన ఆల్ ది బెస్ట్ అనే సినిమాలో నటిస్తుంది.