పరిశ్రమలో తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు రవి బాబు.ఆయన కథను నడిపించే విధానం చాలా కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. “నువ్విలా” చిత్రం విజయం తరువాత ఈ దర్శకుడు ప్రస్తుతం “అవునా” అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హర్షవర్ధన్ రానే కథానాయకుడిగా పూర్ణ కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేకర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయి.