దమ్ము చిత్రం లో ఐటెం సాంగ్ లో మరియం జకారియ నృత్యం చెయ్యబోతున్నారు. కొన్ని రోజుల క్రితం మేము ప్రచురించిన విధంగా ఎన్టీయార్ నలుగురు భామలతో కలిసి డాన్స్ చెయ్యబోతున్నారు. త్రిష,కార్తీక,రచన మౌర్య మరియు తషు కౌశిక్ ఈ నలుగురితో కలిసి డాన్స్ చేయ్యబోతున్నారని చెప్పాము కాని చివరి నిమిషం లో తషు కౌశిక్ తప్పుకుంది. ప్రేమ రక్షిత్ నృత్య దర్శకత్వం అందిస్తున్న ఈ పాటలో తషు కౌశిక్ స్థానంలో మరియం జకారియా కనిపించబోతున్నారు. ఈ పాటను మరో మూడు రోజులు చిత్రీకరించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. కీరవాణి అందించిన సంగీతం ఇపటికే జనంలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 27న విడదల కానుంది.