ప్రేమలో కొత్త కోణాన్ని చూపించే ‘ఎందుకంటే ప్రేమంట’


యంగ్ హీరో రామ్ మరియు వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా కలిసి నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ ‘ఎందుకంటే ప్రేమంట’. తొలిప్రేమ, యువకుడు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి రొమాంటిక్ లవ్ స్టొరీలు తీసి తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న కరుణాకరన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం పై యూత్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రేమికులు తాము ఎప్పుడు ప్రేమలో పడ్డాము అనే విషయంలో స్పష్టత లేకుండా గందరగోళంలో ఉన్నారనే కాన్సెప్ట్ తో ఎందుకంటే ప్రేమంట తెరకెక్కుతుందని సమాచారం. కుటుంబసమేతంగా చూడతగ్గ సినిమాలు నిర్మించే స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల కానున్నది.

Exit mobile version