యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘దమ్ము’ చిత్ర ఆడియో ఈ రోజే విడుదల కానుంది. నందమూరి అభిమానులు మరియు పలువురు ఇండస్ట్రీ పెద్దల సమక్షమలో ఘనంగా ఈ ఆడియోను విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోలో మొత్తం 5 పాటలున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నుండి దమ్ము మార్కెట్లో లభిస్తాయని సదరు ఆడియో కంపెనీ వారు చెబుతున్నారు. దమ్ము సినిమాలో ఎన్టీఆర్ సరసన త్రిషా, కార్తీక నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు.