‘దమ్ము’ పైనే ఆశలన్నీ పెట్టుకున్న త్రిషా


త్రిషా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. అగ్ర హీరోలతోనే కాకుండా దాదాపు ప్రస్తుతం ఉన్న యువ హీరోలందరి సరసన నటించిన హీరొయిన్ ఎవరు అడిగితే చెప్పే సమాధానం త్రిషా. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు లేక సినిమాలకు దూరంగానే ఉంది. అయితే ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘దమ్ము’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎన్టీఆర్, త్రిషా, కార్తీక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న దమ్ము చిత్రం పై ఇండస్ట్రీ వర్గాలు పాజిటివ్ టాక్ చెబుతున్నారు. ఈ సినిమాతో త్రిషా లైమ్ లైట్ లోకి రావడం ఖాయం అని చెబుతున్నారు. బోయపాటి శ్రీను గతంలో తీసిన సింహా సినిమాతో నయనతారకు ఎంత పేరు వచ్చిందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో కూడా త్రిషాకు పేరు రావడం ఖాయం అని విశ్వసనీయ సమాచారం.

Exit mobile version