రచ్చ డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్


మెగా పవర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పొల్లాచ్చిలో ‘సింగరేనుంది’ అనే పాట చిత్రీకరిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకొని ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతుంది. రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ మరియు పారస్ జైన్ నిర్మిస్తున్నారు. గతంలో ‘ఏమైంది ఈ వేళ’ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

Exit mobile version