ఈ మధ్యనే జరిగిన సమంత లండన్ ట్రిప్ లో చిత్రీకరణ మరియు సంగీత చర్చలే కాకుండా మరో ఆసక్తికరమయిన విషయం కూడా జరిగింది . ఇక్కడ ప్రదర్శించబడిన “విక్డ్” అనే బ్రాడ్ వే మ్యూజికల్ తనని ఎంతో ఆశ్చర్య పరిచిందని చెప్పారు. “లండన్ లో “విక్డ్” అనే బ్రాడ్ వే మ్యూజికల్ చూశాను చాలా ఆశ్చర్య పరిచింది. అద్బుతమయిన ప్రదర్శన. ప్రదర్శన ముగిసేంతవరకు కన్నార్పలేదు” అని ట్విట్టర్ లో తెలిపారు. తను ఇండియా చేరుకున్నారు తన సామగ్రి పోగొట్టుకున్నట్టు నిన్న మేము తెలిపాము ఈరోజు తన సామగ్రి దొరికింది తను చాలా ఆనందంగా ఉంది . ప్రస్తుతం ఈ నెల 30న జరిగే “ఈగ” ఆడియో విడుదలకు సిద్దం అవుతున్నారు