లవ్లీకి “యు” సర్టిఫికేట్

ఆది,శంవి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “లవ్లీ” సెన్సార్ కార్ర్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు “యు” సర్టిఫికేట్ ఇచ్చింది. బి.జయ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బి ఏ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బి.జయ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని సెన్సార్ వారు మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని అభినందించారు” అని చెప్పారు చిత్ర నిర్మాత బి ఏ రాజు మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని నైజాంలో ఆర్.ఆర్.మోవీ మేకర్స్ విడుదల చేస్తుండగా మిగిలిన ప్రాంతాలలో “రచ్చ” నిర్మాతలు,బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు” అని చెప్పారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాదిస్తుందని బి ఏ రాజు ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియోకి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం మార్చ్ 30న విడుదల కానుంది.

Exit mobile version