యంగ్ హంక్ రానా దగ్గుబాటికి అన్ని కలిసోచ్చేస్తున్నాయి. ఇప్పటికే టాలివుడ్ మరియు బాలివుడ్ లలో నటుడుగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు హాలివుడ్ లో ప్రవేశించబోతున్నారు “ఏ మొమెంటరి లాప్స్ అఫ్ రీజన్” అనే చిత్రంలో రానా దగ్గుబాటి నటించబోతున్నారు ఈ చిత్రం పలువురు ప్రముఖ హాలివుడ్ తారలు నటించబోతున్నారు. ఈ చిత్రంలో న్యూ యార్క్ మాఫియా ద్వారా బాధపడి, వారి మీద ప్రతీకారం తీర్చుకునే ఒక భారతీయ వ్యాపారవేత్తగా రానా దగ్గుబాటి కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత ఫిలిం మేకర్ బిమల్ రాయ్ మనవడు ఆదిత్య భట్టాచార్య దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడవనున్నాయి.