‘ఈగ’ ఆడియో వేదిక ఖరారు

అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగ’. ఈ చిత్ర ఆడియో ఈ నెల 30న భారీగా విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న బ్రహ్మ కుమారి అకాడెమీలో జరగనుంది. ఈగ ఆడియో తీజర్ ఈ రోజు ఉదయం విడుదల చేయగా విశేష స్పందన లభిస్తుంది. ఈ చిత్రంలో అగ్ర తారలు ఎవ్వరు లేకపోయినప్పటికీ కేవలం రాజమౌళి ఇమేజ్ తో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మర్యాద రామన్న సినిమాలో అగ్ర తారలు లేకపోయినప్పటికీ ప్రచారం విభిన్నంగా చేసారు. ఇప్పుడు ఈగ చిత్రానికి కూడా అదే ఫార్ములాని అనుసరిస్తున్నారు. ఈగ సినిమాలో నాని, సమంతా, సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా తెరకెక్కుతున్న ఏప్రిల్ చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version