“లవ్ టు లవ్”గా రాబోతున్నఆర్య చికుబుకు

తమిళంలో 2010 లో “చికుబుకు” పేరిట ఆర్య,శ్రియ మరియు ప్రీతిక ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ప్రస్తుతం తెలుగులో “లవ్ టు లవ్” అనే పేరుతో విడుదల కానుంది. మనదేశం పతాకం మీద ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. అశోక్ కుమార్ మాట్లడుతూ ప్రేమకథా నేఫధ్యంలో సాగే చిత్రం ఇది. హరిహరన్ అందించిన సంగీతం మరియు శ్రియ అందాలు ప్రీతిక అభినయం ఈ చిత్రం లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని అన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.కె. మణికంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాస్త “లవ్ ఆజ్ కల్” చిత్ర ఛాయలు ఉంటాయి. తెలుగులో ఇప్పటికే ఆ చిత్ర రీమేక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “తీన్ మార్ ” విడుదలయ్యింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి. నాజర్,సంతానం,అనూప్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version