కొచ్చాడియన్ అనువాద హక్కులను సొంతం చేసుకున్న లక్ష్మి గణపతి ఫిల్మ్స్

ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మి గణపతి ఫిల్మ్స్ హాలివుడ్ చిత్రాలను విడుదల చేస్తూ బాగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు రజినీకాంత్ చేస్తున్న “కొచ్చాడియన్” చిత్ర డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఐశ్వర్య రజిని కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలివుడ్ తార దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కే.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారు. “మొజార్ట్ అఫ్ మద్రాస్” ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారి సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ సుమారుగా 150కోట్లు ఉండవచ్చని అంచనా. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి

Exit mobile version