పవన్ – పూరి సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న దేవి శ్రీ ప్రసాద్


యువ సంగీత సంచలనం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఆయన స్క్రిప్ట్ మొత్తం పూర్తిగా చదివిన తరువాత దానికి సరిపోయే మ్యూజిక్ ఇస్తారని గతంలో చాలా మంది చెప్పారు. ఎమ్ఎమ్ కీరవాణి గారు మాత్రమే స్క్రిప్ట్ పూర్తిగా చదివి అందుకు తగ్గట్లు సంగీతం ఇచ్చేందుకు శ్రమ పడేవారు. ఆయన తరువాత ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా అంతటి స్థాయి మ్యూజిక్ ఇస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ త్వరలో పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రాబోతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన దేవి శ్రీ ఆయనకు స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తానని మాట ఇచ్చారు. డివివి దానయ్య నిర్మించబోయే ఈ సినిమా మే నుండి ప్రారంభమవుతుంది.

Exit mobile version