యువ నటుడు రానా మరియు బాబ్లీ బ్యూటీ జెనీలియా కలిసి నటించిన ‘నా ఇష్టం’ చిత్రం రేపు విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య నా ఇష్టం చిత్రం రానా కెరీర్లోనే అత్యధిక ప్రింట్లతో విడుదలవుతుంది. సెన్సార్ బోర్డు నుండి యు/ఎ సర్టిఫికేట్ దక్కించుకున్న ఈ చిత్రం పై రానా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతోనే మొట్ట మొదటి సారిగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ప్రకాష్ తోలేటి. చక్రి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు మార్కెట్లో విడుదలై ప్రేక్షకుల మంచి స్పందన లభిస్తుంది. గతంలో సింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించాడు.