“సినిమాకెళ్దాం రండి” ఆడియో విడుదల

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “సినిమాకెళ్దాం రండి”. ఎం.ఎం.గాంధీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సునీత ప్రభాకర్, సీత నెక్కంటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సాగర్, రేలంగి నరసింహారావు, కొడాలి నాని, నీలకంఠ, చందు, రవికుమార్ చౌదరి మొదలగువారు పాల్గొన్నారు.ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version