ప్రత్యేకం : గుజరాత్ లో “గబ్బర్ సింగ్” ఇంట్రడక్షన్ ఫైట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాల ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్” చిత్రంలో అద్బుతమయిన ఇంట్రడక్షన్ ఫైట్ఉండబోతుంది ఈ పోరాట సన్నివేశాలను గుజరాత్ లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. గతంలో “మగధీర” చిత్రం లోని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన ప్రదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో చేస్తున్న ఈ పోరాట సన్నివేశాల కోసం ఈ నెల 23న చిత్ర బృందం గుజరాత్ పయనమవనున్నారు.పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ లు ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు . మేలో ఈ చిత్ర విడుదలకు సన్నధాలు చేస్తున్నారు. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version