‘3’ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ధనుష్


తమిళ్ స్టార్ నటుడు ధనుష్, శ్రితి హసన్ తో కలిసి నటిస్తున్న ‘3’ సినిమా తెలుగులో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ధనుష్ భార్య మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు దర్శకత్వం వహించింది. ‘వై దిస్ కొలవేరి డి’ అనే పాట విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాగా క్రేజ్ రావడంతో ఈ సినిమాకి బాగా హైప్ వచ్చింది. ఈ చిత్ర తెలుగు హక్కులు దాదాపు 5 కోట్ల రూపాయలకు నట్టి కుమార్ దక్కించుకున్నారు. ధనుష్ నటించిన సినిమాలు గతంలో తెలుగులో విడుదలయ్యాయి కాని అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ చిత్రం పై అతను ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు.

Exit mobile version