శ్రీ రామరాజ్యం సినిమా తరువాత మళ్లీ సినిమాలు చేయనని ప్రకటించిన నయనతార ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తోంది. నాగార్జున సరసన ధశారాద్ డైరెక్షన్లో రానున్న సినిమా, రానా సరసన క్రిష్ డైరెక్షన్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలు అంగీకరించిన విషయం తెలిసిందే. ఇవే కాకా గోపీచంద్ హీరోగా భూపతి పాండ్యన్ డైరెక్షన్లో తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రంలో కూడా నటించనుంది. ఈ చిత్రాన్ని జయ బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.