విక్రం,సుప్రియ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “సశేషం” ఈ చిత్రాన్ని శ్రీ కిషోర్ స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో విడుదలయ్యింది కే.అచ్చిరెడ్డి,సునీల్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ” కేసీ మౌళి ఈ చిత్రానికి అందించిన సంగీతం చాలా బాగుంది ఈ చిత్రం మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను” అని కే.అచ్చి రెడ్డి చెప్పారు. భట్టి విక్రమార్క సీడీని ఆవిష్కరించి సునీల్‌కి ఇచ్చారు. కొత్త వారిని పరిచయం చేస్తూ చేసిన ఈ చిత్రం మంచి విజయం సాదించాలని దర్శకుడికి మంచి పేరు రావాలని సునీల్ అన్నారు. ఈ చిత్రం ఒక లవ్ థ్రిల్లర్, అందరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని నాకు నమ్మకం ఉంది అని, దర్శకత్వం మీద ఉన్న ఆసక్తి చిత్ర పరిశ్రమ వైపు నడిపించింది అని దర్శకుడు మరియు నిర్మాత కిషోర్ అన్నారు. వి.సాగర్,బెల్లంకొండ సురేష్ మరియు సముద్ర లు ఈ వేడుక లో పాల్గొన్నారు