తమిళ స్టార్ నటుడు కార్తి తెలుగులో కూడా బాగా పాపులర్ అవుతున్నాడు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం తెలుగు వారితో తొందరగా కలిసే పోవడం, అతని లుక్ కూడా తెలుగు వారిని ఆకర్షించేలా ఉండటంతో తెలుగు వారికీ బాగా దగ్గరయ్యాడు. కార్తి త్వరలో స్ట్రైట్ ఒక తెలుగు సినిమా చేయబోతున్నాడు. తెలుగు సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అని కార్తిని అడగగా పలు స్క్రిప్టులు వినడం జరిగింది. త్వరలో ఒక ప్రాజెక్ట్ ఖరారు చేసి ప్రకటిస్తాను. కార్తి తెలుగు దర్శకులని తెగ పోగుడుతున్నాడు. రాజమౌళి గారు నేను నటించిన ‘సిరుతై’ సినిమా చూసి మెచ్చుకున్నారు. అది నేనెప్పటికీ మరిచిపోలేను అంటున్నాడు. సిరుతై తెలుగులో వచ్చిన విక్రమార్కుడుకి రీమేక్.