అమ్ముడుపోయిన రచ్చ తూర్పు గోదావరి హక్కులు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రానికి సంభందించిన తూర్పు గోదావరి జిల్లా హక్కులు పూర్వి పిక్చర్స్ వారు దక్కించుకున్నారు. విశాఖపట్నం కి చెందిన వీరు ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ వారి సహకారంతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version