‘మల్లిగాడు’గా రాబోతున్న కార్తి

తమిళ స్టార్ సూర్య సోదరుడు అయిన కార్తి హీరోగా నటించిన మొదటి చిత్రం ‘పరుత్తివీరన్’. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘మల్లిగాడు’ పేరుతో డబ్ చేయబోతున్నారు. పరుత్తివీరన్ తమిళంలో మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కార్తికి జోడీగా ప్రియమణి నటించింది. ఈ చిత్రానికి ఆమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించగా స్టూడియో గ్రీన్ పతాకం పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మల్లిగాడు చిత్రానికి సంభందించిన ట్రైలర్ పైన ఉంది చూడండి.

Exit mobile version