భారీ స్థాయి ప్రేక్షకులతో సిసిఎల్ 2 హిట్

సెలెబ్రిటి క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. సిసిఎల్ 1 కంటే సిసిఎల్ 2 లో నాణ్యత ప్రమాణాలు పెరగడంతో ఈ సీజన్ కి బాగా ప్రేక్షకాదరణ పెరిగింది. కెమెరాలు పెరగడం అలాగే అనుభవం ఉన్న అంపైర్లను తీసుకోవడం వంటి అంశాలు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లగలిగాయి. చెన్నై టీంకి ప్రముఖ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ సలహాలు ఇవ్వడంతో వారి ఫీల్డింగ్ కూడా అధ్బుతంగా చేసారు. అలాగే నిన్న టాలీవుడ్ వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ మధ్య జరిగిన మ్యాచ్ కి విజయ్, శరత్ కుమార్ వంటి హీరోలు వచ్చి ప్రేక్షకులను అలరించారు. అలాగే ఛార్మి, జెనీలియా, అర్చన, నమిత, రిచా గంగోపాధ్యాయ, పూనమ్ బజ్వా వంటి హీరోయిన్స్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

Exit mobile version